మ్యూచువల్ ఫండ్స్ ఓ పెద్ద ప్రపంచం. అందులో ఈక్విటీ ఫండ్సే రూ.2,500కుపైగా ఉన్నాయి. మరి ఇంత భారీ సంఖ్యలో ఉన్న ఈక్విటీ ఫండ్స్ నుంచి మీకు అనువైన పథకం ఎంపిక ఎలా? అన్నది సాధారణ ఇన్వెస్టర్లకు కొరుకుడు పడదు. అయితే, ఈ విషయంలో కొన్ని అంశాల ఆధారంగా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
***పన్ను ఆదా కోసం అయితే...
ఆదాయపన్ను ఆదా చేసుకోవడమే మీ లక్ష్యమైతే మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) తప్పకుండా ఉండాలి. క్రమం తప్పకుండా ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు చేస్తూ వెళితే దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లోనూ ఒక్కో పథకం ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుందన్న దాని ఆధారంగా రిస్క్ ఆధారపడి ఉంటుంది.
***పెట్టుబడులు ఎంత కాలం?
మీ పెట్టుబడులను ఎంత కాలం కోసం పెడుతున్నారన్న అంశమే ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలా లేక డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలా అనేదాన్ని నిర్ణయిస్తుంది. దీర్ఘకాలం కోసం అయితే, అంటే ఐదేళ్లుపైబడి కోసం ఈక్విటీలు మెరుగైన సాధనం. స్వల్ప కాలంలో ఈక్విటీ మార్కెట్లో ఆటుపోట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో అయితే ఈ ఆటుపోట్ల ప్రభావం తగ్గి రాబడులు ఆశించగలరు. స్వల్పకాలం కోసం అయితే డెట్ ఫండ్స్ అనుకూలం.
***రిస్క్ ఎందులో ఎంత...
డెట్ ఫండ్స్‌లో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒకవిధంగా వీటిని సురక్షితమనే చెప్పుకోవాలి. కానీ, ఈక్విటీ ఫండ్స్‌లో మాత్రం అవి ఏ తరహా ఫండ్స్ అన్నదాన్ని బట్టి రిస్క్ మారిపోతుంది. బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో తక్కువ రిస్క్. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రిస్క్ ఎక్కువ ఉన్నవి. బ్యాలన్స్‌డ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే రిస్క్ తక్కువ. లార్జ్ క్యాప్ ఫండ్స్ అధిక మార్కెట్ విలువ కలిగిన షేర్లలో (బ్లూచిప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దాంతో రిస్క్ తక్కువ. డైవర్సిఫైడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీల్లోనే చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే మిడ్, స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో రిస్క్ ఎక్కువ, రాబడులూ ఎక్కువే. ఇక ఏదేనీ ఒక రంగంలోని కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే సెక్టార్ ఫండ్స్/ థీమ్ ఫండ్స్ అనుకూలం కాదు. వీటిలో భారీ ఆటుపోట్లు ఉంటాయి. వైవిధ్యం కూడా తక్కువే. విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయాలని ఆశించే వారు ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
***వయసును బట్టి...
మీ వయసు కూడా పెట్టుబడులకు కీలకమే. మీ పెట్టుబడుల లక్ష్యం దీర్ఘకాలం అయితే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైరైన వారు సైతం బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్న వయసులో ఉన్న వారు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయగలరు. కనుక వారు ఈక్విటీ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఈ అంశాల ఆధారంగా ఏ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో స్పష్టతకు వస్తే, ఆ తర్వాత ఆయా విభాగంలో టాప్ రేటింగ్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచిది. మార్నింగ్ స్టార్, వ్యాల్యూరీసెర్చ్ వంటి సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి.

Comments
Post a Comment