ఏటా వేతనం పెరిగితే దానికి తగ్గట్టే రుణ చెల్లింపు బోనస్, ఇతరత్రా నగదు అందితే అదీ ఈఎంఐకే ఇలా చేస్తే వడ్డీ భారం; కాల వ్యవధి రెండూ తగ్గుతాయి లేదంటే రుణ కాల వ్యవధి పెంచుకోవడమే పరిష్కారం సొంతింటిని గౌరవానికి చిహ్నంగా భావించే వారు మనలో చాలామంది. సొంతిల్లును తమ జీవితంలో కీలక లక్ష్యాల్లో ఒకటిగా చేర్చుకోవAడంతో పాటు దాన్ని ఏదో ఒకరోజు వీలైతే చిన్న వయసులోనే సాకారం చేసుకోవాలని కోరుకోవడం సహజం. తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు లభించే ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల సాకారం అసాధ్యమేమీ కాదు. కేంద్రం నుంచి ఇళ్ల కొనుగోలుకు వడ్డీ రాయితీలు కూడా ఉండడంతో బడ్జెట్ ధరలోని గృహాలకు డిమాండ్ పెరిగింది. మున్ముందు ఈ మార్కెట్ ఇంకా వృద్ధి చెందుతుందనేది నిపుణుల అంచనా. అయితే, సొంతింటికి ప్లాన్ చేసుకునే వారు తమ వంతు కొంత నిధిని సమకూర్చుకోకపోతే ప్రతి నెలా అధికంగా ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. దీంతో వస్తున్న ఆదాయంలో అధిక భాగం ఇంటి రుణ వాయిదాలకే చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి రుణాన్ని ఇబ్బంది లేకుండా స్మార్ట్‌గా తీర్చే మార్గాలను నిపుణులు తెలియజేస్తున్నారు... బోనస్...