Skip to main content

Posts

ఇంటి రుణం తీర్చే.. ఈజీ మార్గాలివి!

ఏటా వేతనం పెరిగితే దానికి తగ్గట్టే రుణ చెల్లింపు బోనస్, ఇతరత్రా నగదు అందితే అదీ ఈఎంఐకే ఇలా చేస్తే వడ్డీ భారం; కాల వ్యవధి రెండూ తగ్గుతాయి లేదంటే రుణ కాల వ్యవధి పెంచుకోవడమే పరిష్కారం   సొంతింటిని గౌరవానికి చిహ్నంగా భావించే వారు మనలో చాలామంది. సొంతిల్లును తమ జీవితంలో కీలక లక్ష్యాల్లో ఒకటిగా చేర్చుకోవAడంతో పాటు దాన్ని ఏదో ఒకరోజు వీలైతే చిన్న వయసులోనే సాకారం చేసుకోవాలని కోరుకోవడం సహజం. తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు లభించే ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల సాకారం అసాధ్యమేమీ కాదు. కేంద్రం నుంచి ఇళ్ల కొనుగోలుకు వడ్డీ రాయితీలు కూడా ఉండడంతో బడ్జెట్‌ ధరలోని గృహాలకు డిమాండ్‌ పెరిగింది. మున్ముందు ఈ మార్కెట్‌ ఇంకా వృద్ధి చెందుతుందనేది నిపుణుల అంచనా. అయితే, సొంతింటికి ప్లాన్‌ చేసుకునే వారు తమ వంతు కొంత నిధిని సమకూర్చుకోకపోతే ప్రతి నెలా అధికంగా ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. దీంతో వస్తున్న ఆదాయంలో అధిక భాగం ఇంటి రుణ వాయిదాలకే చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి రుణాన్ని ఇబ్బంది లేకుండా స్మార్ట్‌గా తీర్చే మార్గాలను నిపుణులు తెలియజేస్తున్నారు... బోనస్‌...
Recent posts

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎంపిక ఎలా?

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఓ పెద్ద ప్రపంచం. అందులో ఈక్విటీ ఫండ్సే రూ.2,500కుపైగా ఉన్నాయి. మరి ఇంత భారీ సంఖ్యలో ఉన్న ఈక్విటీ ఫండ్స్‌ నుంచి మీకు అనువైన పథకం ఎంపిక ఎలా? అన్నది సాధారణ ఇన్వెస్టర్లకు కొరుకుడు పడదు. అయితే, ఈ విషయంలో కొన్ని అంశాల ఆధారంగా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ***పన్ను ఆదా కోసం అయితే... ఆదాయపన్ను ఆదా చేసుకోవడమే మీ లక్ష్యమైతే మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) తప్పకుండా ఉండాలి. క్రమం తప్పకుండా ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు చేస్తూ వెళితే దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోనూ ఒక్కో పథకం ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుందన్న దాని ఆధారంగా రిస్క్‌ ఆధారపడి ఉంటుంది.  ***పెట్టుబడులు ఎంత కాలం? మీ పెట్టుబడులను ఎంత కాలం కోసం పెడుతున్నారన్న అంశమే ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలా లేక డెట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలా అనేదాన్ని నిర్ణయిస్తుంది. దీర్ఘకాలం కోసం అయితే, అంటే ఐదేళ్లుపైబడి కోసం ఈక్విటీలు మెరుగైన సాధనం. స్వల్ప కాలంలో ఈక్విటీ మార్కెట్లో ఆటుపోట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకా...

అప్‌కమింగ్ కెరీర్...ఫిన్‌టెక్

ఫిన్‌టెక్ పూర్తి పేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఆర్థిక రంగంలో అమలు చేస్తున్న సంప్రదాయ పద్ధతుల స్థానంలో సరికొత్త అప్లికేషన్లను రూపొందించి అమల్లోకి తేవడం దీని ఉద్దేశం. ***ఫిన్‌టెక్ అంటే..? ఫిన్‌టెక్.. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ ఎలాంటి చొరబాట్లకు తావు లేకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. బ్యాంకింగ్, ఫైనాన్స్ అవసరాలను తీర్చడంతోపాటు విసృ్తత ఉద్యోగ అవకాశాలకు వేదిక నిలుస్తోంది.. ఫిన్‌టెక్. దాంతో ఫ్రెండ్లీ బ్యాంకర్, టెకీలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 72 ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్నాయి. పర్సనల్ లోన్స్, ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్, కార్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్, ఈఎంఐ, హెల్త్ ఇన్సూరెన్స్, టికెట్ పర్చేస్ వంటి సేవలను ఫిన్‌టెక్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ తాము అందించే సేవలను పర్యవేక్షించడం కోసం ఐటీ, ఫిన్‌టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ***ఇండియాలో ఫిన్‌టెక్ సంస్థలు... పేటీఎం పేమెంట్ బ్యాంక్, పేయూ ఇండి యా, ఫ్రీ చార్జ్, క్విక్ వాలెట్, మొబిక్విక్, చిల్లర్, ఎస్‌బీఐ బడ్డీ, ఐసీఐసీఐ పాకెట్స్, క్యాపిటల్ ప్లోట్, ఫ్లెక్సిలోన్స్, వ...

సుస్థిర కెరీర్‌కు..రీ–స్కిల్లింగ్‌ !

ఫ్రెషర్, ట్రైనీ, సీనియర్‌.. స్థాయి ఏదైనా ఇప్పుడందరి దృష్టి రీ–స్కిల్లింగ్‌పైనే! స్కిల్స్, స్కిల్‌ గ్యాప్‌ గురించి తెలుసు..‘రీ –స్కిల్లింగ్‌’ అంటే ఏమిటి? నిపుణుల అభిప్రాయంలో రీ–స్కిల్లింగ్‌ అంటే.. నూతన టెక్నాలజీ, నైపుణ్యాలపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవడం!   కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల ప్రక్రియలో ప్రవేశపెడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఉద్యోగులకు సరైన అవగాహన ఉండాలని కోరుకుంటున్నాయి. అలాంటి వారినే ప్రోత్సహిస్తున్నాయి. అంటే.. రీ స్కిల్లింగ్‌తోనే కెరీర్‌లో ముందుకు సాగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రీ స్కిల్లింగ్‌ గురించి తెలుసుకుందాం.. ఫ్రెషర్‌.. మరికొద్ది రోజుల్లో సర్టిఫికెట్‌ చేతికందనుందనే ఆనందం! నాలుగేళ్ల కృషి ఫలితంగా బీటెక్‌ పూర్తవుతోందనే సంతోషం! మరోవైపు జాబ్‌ మార్కెట్లో సరికొత్త ట్రెండ్స్, తాజా సర్వేలపై ఆందోళన! సర్టిఫికెట్లు సరే.. స్కిల్స్‌ మాటేంటి?’ అంటున్న కంపెనీల «ధోరణితో భవిష్యత్‌పై బెంగ! ట్రైనీ.. రాత పరీక్ష, ఇంటర్వ్యూలను దాటి.. కొలువులో చేరి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కానీ, కంపెనీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందేనంటూ య...

బీమా.. కెరీర్‌కు ధీమా!!

****ఏ కోర్సు చూసినా.. ఏ రంగంలోనైనా పోటీ రోజురోజుకీ తీవ్రమవుతోంది. అగ్రికల్చర్ నుంచి ఆస్ట్రానమీ వరకూ.. ప్రతి రంగంలోనూ పోటీనే. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల కాలంలో కెరీర్‌కు ధీమా ఇస్తోంది.. బీమా రంగం!!. దేశంలో బ్యాంకింగ్ రంగంతోపాటు శరవేగంగా వృద్ధి చెందుతూ.. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌లుగా విస్తరించింది. అటు కెరీర్ పరంగానూ ఉజ్వల భవితకు మార్గం వేస్తున్న బీమా కెరీర్‌పై విశ్లేషణ.. >>>ఇన్సూరెన్స్.. ఈ మాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మెట్రో సిటీ నుంచి మారుమూల పల్లె వరకు బీమా కార్యకలాపాలు విస్తరించాయి. గతంలో ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ వంటివే ప్రజలకు గుర్తుకు వచ్చేవి. కానీ ప్రైవేటీకరణ నేపథ్యంలో.. అనేక ప్రైవేటు కంపెనీలు ఇన్సూరెన్స్ రంగంలో అడుగుపెట్టాయి. అంతేకాకుండా వ్యాపార కోణం లో పోటీదారులను ఎదుర్కొనేందుకు నిపుణులైన మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. దాంతో అటు మార్కెట్ అవసరాలు.. ఇటు ఇన్సూరెన్స్ రంగ పురోగతిని పరిశీలిస్తే.. 2020 నాటికి బీమా రంగంలో వివిధ హోదాల్లో దాదాపు 50వేల మంది అవసరం ఉం...

ఫ్రీలాన్సింగ్... నైపుణ్యమే పెట్టుబడి!

ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. నచ్చిన సమయంలో, ఇష్టమైన ప్రదేశంలో, వీలున్నప్పుడు.. బిందాస్‌గా పనిచేస్తూ సంపాదించడమే ఫ్రీలాన్సింగ్. ఏదైనా ఒక డిమాండింగ్ స్కిల్ తెలిసుంటే చాలు. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌తో లైఫ్‌ను నింపాదిగా గడిపేయొచ్చు. ఇటీవల అన్నిదేశాల్లోనూ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్ పుంజుకుంటోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రతిభగల యువతకు చక్కటి అవకాశంగా నిలుస్తోందీ రంగం. భవిష్యత్‌లో ఫ్రీలాన్సింగ్ మరింత విస్తృతమవుతుందనే అంచనాల నేపథ్యంలో దీనిపై విశ్లేషణ.. నిర్దిష్ట పనిగంటలు, డెడ్‌లైన్లు, అవసరమున్నా లేకున్నా మీటింగులు, టార్గెట్లు వంటివి లేని వర్క్ లైఫ్.. ఫ్రీలాన్సింగ్! ఇష్టమైన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు, నైపుణ్యముంటే రెగ్యులర్ ఉద్యోగం కంటే ఎక్కువగా సంపాదించుకునే వీలు.. వెరసి ఫ్రీలాన్సింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. కంటెంట్ రైటింగ్ నుంచి కార్పొరేట్ ప్రొడక్ట్ డెలివరీ వరకు.. అన్ని ఉద్యోగాలూ ఫ్రీలాన్సింగ్‌కు అనువైనవే! వీటికి డిమాండ్ : ఫ్రీలాన్సింగ్‌లో ఐటీ నైపుణ్యాలు, కంటెంట్ రైటింగ్ స్కిల్స్‌కు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, మై ఎస్‌క్య...

ఆన్‌లైన్ డిగ్రీ విధివిధానాలు, ప్రయోజనాలు...

ఆన్‌లైన్ డిగ్రీ విధివిధానాలు, ప్రయోజనాలు... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ నాన్ టెక్నికల్ సబ్జెక్టులకు సంబంధించి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో మరో నెల రోజుల్లోనే నూతన విధానాలు రూపొందే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఆన్‌లైన్ డిగ్రీ విధివిధానాలు, ప్రయోజనాలు, ప్రతికూలత ఉన్నత విద్యకు సంబంధించి స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 20 నుంచి 25 శాతం మధ్యలో ఉంటోంది. దూరవిద్య నమోదు నిష్పత్తి 11.45 శాతంగా ఉంది. ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి కోర్సులో (యూజీ లెవల్) నమోదు నిష్పత్తి 38 శాతం కాగా, కామర్స్ కోర్సుల్లో ఇది అత్యల్పంగా 14.1 శాతంగా ఉంది. ఈ వివరాలన్నీ ఉన్నత విద్య నమోదు కోణంలో ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్‌హెచ్‌ఈ)లో వెల్లడయ్యాయి. దీంతో హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా నమోదు నిష్పత్తిని పెంచే లక్ష్యంతో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని చూస్తోంది. తద్వారా 18 నుంచి 23 ఏళ్ల విద్యార్థులు కాలేజీకి వెళ్లకుండానే ఉన్నత విద్య అభ్యసిస్తారని ...