Skip to main content

సుస్థిర కెరీర్‌కు..రీ–స్కిల్లింగ్‌ !

ఫ్రెషర్, ట్రైనీ, సీనియర్‌.. స్థాయి ఏదైనా ఇప్పుడందరి దృష్టి రీ–స్కిల్లింగ్‌పైనే! స్కిల్స్, స్కిల్‌ గ్యాప్‌ గురించి తెలుసు..‘రీ –స్కిల్లింగ్‌’ అంటే ఏమిటి? నిపుణుల అభిప్రాయంలో రీ–స్కిల్లింగ్‌ అంటే.. నూతన టెక్నాలజీ, నైపుణ్యాలపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవడం!
 
కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల ప్రక్రియలో ప్రవేశపెడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఉద్యోగులకు సరైన అవగాహన ఉండాలని కోరుకుంటున్నాయి. అలాంటి వారినే ప్రోత్సహిస్తున్నాయి. అంటే.. రీ స్కిల్లింగ్‌తోనే కెరీర్‌లో ముందుకు సాగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రీ స్కిల్లింగ్‌ గురించి తెలుసుకుందాం..

ఫ్రెషర్‌..మరికొద్ది రోజుల్లో సర్టిఫికెట్‌ చేతికందనుందనే ఆనందం! నాలుగేళ్ల కృషి ఫలితంగా బీటెక్‌ పూర్తవుతోందనే సంతోషం! మరోవైపు జాబ్‌ మార్కెట్లో సరికొత్త ట్రెండ్స్, తాజా సర్వేలపై ఆందోళన! సర్టిఫికెట్లు సరే.. స్కిల్స్‌ మాటేంటి?’ అంటున్న కంపెనీల «ధోరణితో భవిష్యత్‌పై బెంగ!

ట్రైనీ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూలను దాటి.. కొలువులో చేరి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కానీ, కంపెనీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందేనంటూ యాజమాన్యం నుంచి హెచ్చరికలు! ప్రొబేషన్‌ పూర్తికాకుండానే ఉద్యోగ భద్రతపై ఆందోళన!

సీనియర్‌..సంస్థలో పదేళ్ల అనుభవం.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమ్‌ను నడిపించే స్థాయి! ఎన్నో టాస్క్‌లను విజయవంతంగా పూర్తిచేసి కంపెనీ వృద్ధిలో కీలకంగా నిలిచిన ఘనత! అయినా ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోక తప్పదనే సంకేతం!
ఇలా.. ఫ్రెషర్స్, ట్రైనీ, మిడిల్‌ లెవల్, సీనియర్‌ లెవల్‌.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఎదురవుతున్న సమస్య.. స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్‌. కాబట్టి కాలేజీలో చదువుతున్న విద్యార్థులతోపాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ తమ రంగాలకు సంబంధించిన నూతన నైపుణ్యాలు, టెక్నాలజీల గురించి తెలుసుకోవాలి. వాటిని పరిశ్రమలో ఏ స్థాయిలో అమలుచేస్తున్నారనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి.

సేవా రంగం నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు..జాబ్‌ మార్కెట్‌లో ప్రస్తుతం ‘రీ–స్కిల్లింగ్‌’ అనే మాట సర్వీస్‌ సెక్టార్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ రంగం వరకు వినిపిస్తోంది. కారణం.. ఆయా రంగాల్లోని సంస్థలు కొత్త నైపుణ్యాలతో ఉత్పత్తులు, సర్వీసులను అందిస్తుండటమే. దీంతో ఆయా విభాగాల్లో కొలువుదీరాలంటే సంబంధిత నైపుణ్యాలపై పట్టు సాధించక తప్పని పరిస్థితి. కాబట్టి ‘తరగతి గదిలో నేర్చుకున్నది సరిపోతుంది, ఇంటర్న్‌షిప్‌ అనుభవం కలిసొస్తుంది’ అనే ధోరణికి స్వస్తి పలకాలంటున్నారు నిపుణులు.

క్యాంపస్‌లో కొలువు దక్కినా!
క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లోనే ఉద్యోగం పొందినా.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ‘ఆఫర్‌ లభించింది కదా..!’ అని రిలాక్స్‌ అవుదామనుకుంటే కంపెనీలు అంగీకరించే పరిస్థితి లేదు. ఫ్రెషర్స్‌కే కాదు సీనియర్‌ లెవల్‌లోనూ రీ–స్కిల్లింగ్‌ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా కంపెనీలు యంగ్‌ మిలీనియల్స్‌ (1980–96 మధ్య పుట్టిన వారు)పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. వారిలో రీ–స్కిల్లింగ్‌పై ఉన్న ఆసక్తి, ఆ దిశగా వారు చేస్తున్న కృషిని నిరంతరం గమనిస్తున్నాయి. దీన్ని గుర్తించే క్యాంపస్‌ డ్రైవ్స్‌లో రూ.లక్షల ప్యాకేజ్‌తో ఆఫర్లు అందుకున్న వారు సైతం రీ–స్కిల్లింగ్‌ బాట పడుతున్నారు.

రీ–స్కిల్లింగ్‌కు మార్గాలు..
కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎలా? ఈ విషయంలో ఆందోళన సహజం. అలాంటి వారి కోసం ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్‌లైన్‌ టూల్స్‌ ముఖ్యమైనవి. వీటి ద్వారా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సైతం ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్స్‌ అందిస్తున్నాయి. డిజైన్, డెవలప్‌మెంట్, మార్కెటింగ్‌లకు సంబంధించి కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. నిరంతర అన్వేషణ, నిత్య అధ్యయనాలతోæ కొత్త నైపుణ్యాలపై పట్టు సాధించడం ఏమంత కష్టం కాదు.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌
ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ).. వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీ. దీని ఆధారంగా మెషీన్లు, కంప్యూటర్లను అనుసంధానించి స్వల్ప సమయంలో సంబంధిత టాస్క్‌లను పూర్తిచేయొచ్చు. వాస్తవానికి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరిధి విస్తృతమైంది. మరోవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), బిగ్‌ డేటా, డేటా అనలిటిక్స్, మెషీన్‌ లెర్నింగ్‌ ప్రాధాన్యం పెరుగుతోంది.

కృత్రిమ మేధ..
నూతన నైపుణ్యాలు, రీ–స్కిల్లింగ్‌ పరంగా ఇటీవల కాలంలో కృత్రిమ మేధ కీలకంగా మారుతోంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి రోబోలు, వర్చువల్‌ టెక్నాలజీల సహకారంతో కార్యకలాపాలను నిర్వహించడం కృత్రిమ మేధ ప్రత్యేకత. దీనివల్ల కంపెనీలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ కారణంగానే కృత్రిమ మేధ విస్తృతమవుతోంది.

మెషీన్‌ లెర్నింగ్‌
పనిలో మానవ ప్రమేయాన్ని తగ్గించే మరో విధానం మెషీన్‌ లెర్నింగ్‌. ఇందులో టాస్క్‌ నిర్వహణ కోణంలో సంబంధిత మెషీన్‌కు అవసరమైన ప్రోగ్రామ్‌ను రూపొందించి.. సొంతంగా డేటా సేకరణ, విశ్లేషణ వంటి కార్యకలాపాలు నిర్వహించేలా మెషీన్లను తీర్చిదిద్దుతారు. దీనికి తగిన ప్రోగ్రాములు, చిప్‌ల రూపకల్పన, సర్క్యూట్ల డిజైన్లు అవసరం. అందువల్లే ఇప్పుడు ఈ కోణంలో నిపుణుల అవసరం పెరుగుతోంది. కాబట్టి రీ–స్కిల్లింగ్‌ కోణంలో ఫ్రెషర్స్‌ నుంచి సీనియర్‌ లెవల్‌ ఉద్యోగుల వరకు మెషీన్‌ లెర్నింగ్‌పై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి.
పై అంశాలతోపాటు రీ–స్కిల్లింగ్‌ కోణంలో డేటా అనలిటిక్స్, బిగ్‌ డేటా, డేటా మేనేజ్‌మెంట్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

సర్టిఫికేషన్స్‌ :
రీ–స్కిల్లింగ్‌లో భాగంగా కొన్ని సంస్థలు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఫ్రెషర్స్‌కు ఈ సౌకర్యం ఉండదు. కాబట్టి వారంతా వివిధ సంస్థలు ఆఫర్‌ చేస్తున్న ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్స్‌ను అందిపుచ్చుకోవాలి. తద్వారా రీ–స్కిల్లింగ్‌ బాటలో ముందడుగు వేయొచ్చు. ప్రస్తుతం ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ, జావా, శాప్‌ తదితర సంస్థలు నూతన నైపుణ్యాలపై సర్టిఫికేషన్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. ఫ్రెషర్స్‌ వీటిని వినియోగించు కోవాలి.

Comments

Popular posts from this blog

అప్‌కమింగ్ కెరీర్...ఫిన్‌టెక్

ఫిన్‌టెక్ పూర్తి పేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఆర్థిక రంగంలో అమలు చేస్తున్న సంప్రదాయ పద్ధతుల స్థానంలో సరికొత్త అప్లికేషన్లను రూపొందించి అమల్లోకి తేవడం దీని ఉద్దేశం. ***ఫిన్‌టెక్ అంటే..? ఫిన్‌టెక్.. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ ఎలాంటి చొరబాట్లకు తావు లేకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. బ్యాంకింగ్, ఫైనాన్స్ అవసరాలను తీర్చడంతోపాటు విసృ్తత ఉద్యోగ అవకాశాలకు వేదిక నిలుస్తోంది.. ఫిన్‌టెక్. దాంతో ఫ్రెండ్లీ బ్యాంకర్, టెకీలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 72 ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్నాయి. పర్సనల్ లోన్స్, ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్, కార్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్, ఈఎంఐ, హెల్త్ ఇన్సూరెన్స్, టికెట్ పర్చేస్ వంటి సేవలను ఫిన్‌టెక్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ తాము అందించే సేవలను పర్యవేక్షించడం కోసం ఐటీ, ఫిన్‌టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ***ఇండియాలో ఫిన్‌టెక్ సంస్థలు... పేటీఎం పేమెంట్ బ్యాంక్, పేయూ ఇండి యా, ఫ్రీ చార్జ్, క్విక్ వాలెట్, మొబిక్విక్, చిల్లర్, ఎస్‌బీఐ బడ్డీ, ఐసీఐసీఐ పాకెట్స్, క్యాపిటల్ ప్లోట్, ఫ్లెక్సిలోన్స్, వ...

ఫ్రీలాన్సింగ్... నైపుణ్యమే పెట్టుబడి!

ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. నచ్చిన సమయంలో, ఇష్టమైన ప్రదేశంలో, వీలున్నప్పుడు.. బిందాస్‌గా పనిచేస్తూ సంపాదించడమే ఫ్రీలాన్సింగ్. ఏదైనా ఒక డిమాండింగ్ స్కిల్ తెలిసుంటే చాలు. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌తో లైఫ్‌ను నింపాదిగా గడిపేయొచ్చు. ఇటీవల అన్నిదేశాల్లోనూ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్ పుంజుకుంటోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రతిభగల యువతకు చక్కటి అవకాశంగా నిలుస్తోందీ రంగం. భవిష్యత్‌లో ఫ్రీలాన్సింగ్ మరింత విస్తృతమవుతుందనే అంచనాల నేపథ్యంలో దీనిపై విశ్లేషణ.. నిర్దిష్ట పనిగంటలు, డెడ్‌లైన్లు, అవసరమున్నా లేకున్నా మీటింగులు, టార్గెట్లు వంటివి లేని వర్క్ లైఫ్.. ఫ్రీలాన్సింగ్! ఇష్టమైన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు, నైపుణ్యముంటే రెగ్యులర్ ఉద్యోగం కంటే ఎక్కువగా సంపాదించుకునే వీలు.. వెరసి ఫ్రీలాన్సింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. కంటెంట్ రైటింగ్ నుంచి కార్పొరేట్ ప్రొడక్ట్ డెలివరీ వరకు.. అన్ని ఉద్యోగాలూ ఫ్రీలాన్సింగ్‌కు అనువైనవే! వీటికి డిమాండ్ : ఫ్రీలాన్సింగ్‌లో ఐటీ నైపుణ్యాలు, కంటెంట్ రైటింగ్ స్కిల్స్‌కు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, మై ఎస్‌క్య...

ఇంటి రుణం తీర్చే.. ఈజీ మార్గాలివి!

ఏటా వేతనం పెరిగితే దానికి తగ్గట్టే రుణ చెల్లింపు బోనస్, ఇతరత్రా నగదు అందితే అదీ ఈఎంఐకే ఇలా చేస్తే వడ్డీ భారం; కాల వ్యవధి రెండూ తగ్గుతాయి లేదంటే రుణ కాల వ్యవధి పెంచుకోవడమే పరిష్కారం   సొంతింటిని గౌరవానికి చిహ్నంగా భావించే వారు మనలో చాలామంది. సొంతిల్లును తమ జీవితంలో కీలక లక్ష్యాల్లో ఒకటిగా చేర్చుకోవAడంతో పాటు దాన్ని ఏదో ఒకరోజు వీలైతే చిన్న వయసులోనే సాకారం చేసుకోవాలని కోరుకోవడం సహజం. తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు లభించే ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల సాకారం అసాధ్యమేమీ కాదు. కేంద్రం నుంచి ఇళ్ల కొనుగోలుకు వడ్డీ రాయితీలు కూడా ఉండడంతో బడ్జెట్‌ ధరలోని గృహాలకు డిమాండ్‌ పెరిగింది. మున్ముందు ఈ మార్కెట్‌ ఇంకా వృద్ధి చెందుతుందనేది నిపుణుల అంచనా. అయితే, సొంతింటికి ప్లాన్‌ చేసుకునే వారు తమ వంతు కొంత నిధిని సమకూర్చుకోకపోతే ప్రతి నెలా అధికంగా ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. దీంతో వస్తున్న ఆదాయంలో అధిక భాగం ఇంటి రుణ వాయిదాలకే చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి రుణాన్ని ఇబ్బంది లేకుండా స్మార్ట్‌గా తీర్చే మార్గాలను నిపుణులు తెలియజేస్తున్నారు... బోనస్‌...